suicide: కూతుళ్లకు ఉరివేసి.. ఆపై తానూ ఆత్మహత్య చేసుకున్న తల్లి

  • అనంతపురం జిల్లా లేపాక్షి మండలం నాయనపల్లిలో ఘటన
  • భర్త వేధింపులే కారణం
  • ఇద్దరూ ఆడపిల్లలే పుట్టడంతో అదనపు కట్నం కోసం చిత్ర హింసలు
కల్పన అనే ఓ మహిళ తన ఇద్దరు పిల్లలు మేఘన (6), యశస్విని (3) లను ఉరి వేసి చంపేసి, ఆపై తాను కూడా ఆత్మహత్య చేసుకున్న ఘటన అనంతపురం జిల్లా లేపాక్షి మండలం నాయనపల్లిలో చోటు చేసుకుంది. ఇద్దరూ ఆడపిల్లలే పుట్టడంతో తన భర్త వీరభద్రప్ప పెడుతోన్న వేధింపులు భరించలేకే కల్పన ఈ ఘటనకు పాల్పడినట్లు తెలిసింది. కల్పన భర్త అదనపు కట్నం తీసుకురావాలని ఆమెను వేధిస్తున్నాడని ఆమె బంధువులు అంటున్నారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. ఈ ఘటనపై మరింత సమాచారం అందాల్సి ఉంది.  
suicide
women
daughters

More Telugu News