ఐపీఎల్ వేలంలో పాల్గొన్న అతిపిన్న వయస్కురాలు.. జాన్వి మెహతా
- ఈమె నటి జూహీచావ్లా కూతురు
- లండన్లో చదువుకుంటోన్న 17 ఏళ్ల జాన్వి
- కోల్కతా నైట్రైడర్స్ జట్టు ఫ్రాంచైజీలో జూహీ ఒకరు
వేలానికి హాజరైన వారిలో అతిపిన్న వయస్కురాలిగా జాన్వి నిలిచింది. ప్రస్తుతం లండన్లో చదువుకుంటున్న జాన్వి ఈ మధ్యే ఇండియా వచ్చింది. వేలం అనంతరం మీడియాతో మాట్లాడిన జాన్వి తమ జట్టు క్రిస్ లిన్ను సొంతం చేసుకోవడం చాలా సంతోషంగా ఉందని చెప్పింది. త్వరలో ప్రారంభంకానున్న ఐపీఎల్ మ్యాచులకు కూడా తల్లితో కలిసి జాన్వి హాజరయ్యే అవకాశం ఉందని ఓ అంచనా.