Get Instant Access to ap7am Free web app · Opens in one tap Install

ఇప్పట్లో పెళ్లి మాటే లేదంటున్న శ్రుతిహాసన్

  • ప్రస్తుతం మ్యూజిక్ ఆల్బమ్స్ పైనే దృష్టి 
  • వచ్చే ఏడాది మూడు ఆల్బమ్స్ రిలీజ్ 
  • ఆ దిశగా సన్నాహాలు    
అందాల కథానాయికగా కుర్రకారు మనసులు దోచేసిన శ్రుతిహాసన్, ఈ మధ్య కాలంలో తెలుగు .. తమిళ సినిమాలను తగ్గించేసింది. బాయ్ ఫ్రెండ్ తో కలిసి చక్కర్లు కొడుతూ వార్తల్లో నిలుస్తోంది. త్వరలో వీరి పెళ్లి జరుగుతుందని అంతా అనుకున్నారు. కానీ తాజా ఇంటర్వ్యూలో శ్రుతిహాసన్ మాట్లాడుతూ, ఇప్పట్లో పెళ్లి మాటే లేదని స్పష్టం చేసింది.

ఫలానా సమయంలో పెళ్లి చేసుకోవాలనే రూలేం తాను పెట్టుకోలేదనీ, పెళ్లి విషయంలో తన తల్లిదండ్రులు కూడా తనని ఇబ్బంది పెట్టడం లేదని చెబుతోంది. పెళ్లి విషయంలో తనకి వాళ్లు పూర్తి స్వేచ్ఛను ఇచ్చారని అంటోంది. 2018లో మూడు మ్యూజిక్ ఆల్బమ్స్ ను రిలీజ్ చేయాలనే ఆలోచనలో ఉన్నాననీ, ప్రస్తుతం ఆ పనులపైనే పూర్తి దృష్టి పెట్టానని చెబుతోంది. ఈ లోగా వీలును బట్టి ఓ హిందీ సినిమా చేయాలనుకుంటోందట.    
sruthi hasan

More Telugu News