Nalgonda District: నల్గొండ జిల్లాలో దారుణం... జెండా దిమ్మెపై తల... మొండెం కోసం పోలీసుల వెతుకులాట!

  • తలను చూసి స్థానికుల భయభ్రాంతులు
  • మృతుడు ట్రాక్టర్ డ్రైవర్ రమేష్ గా గుర్తింపు
  • కేసు నమోదు, విచారణ ప్రారంభం
నల్గొండ జిల్లాలోని బొట్టుగూడలో దారుణం జరిగింది. ఇక్కడి ఓ జెండా దిమ్మెపై గుర్తు తెలియని వ్యక్తులు మొండెంలేని తలను తెచ్చి పెట్టడం కలకలం రేపింది. ఈ ఉదయం తలను చూసిన స్థానికులు భయభ్రాంతులై పోలీసులకు సమాచారం ఇవ్వగా, పోలీసులు వచ్చి విచారణ చేపట్టారు. తల వద్ద ఎటువంటి రక్తపు మరకలూ లేకపోవడంతో ఎక్కడో హత్య చేసి ఉంటారని పోలీసులు భావిస్తున్నారు. మృతుడు కనగల్‌ కు చెందిన ట్రాక్టర్ డ్రైవర్ పాలకుర్తి రమేష్‌ అని గుర్తించారు. కేసు నమోదు చేసి మొండెం కోసం గాలిస్తున్నామని తెలిపారు. నెలరోజుల క్రితం రమేష్‌ కు కొంతమంది బొట్టుగూడ వ్యక్తులతో గొడవ జరిగిందని, ఈ హత్య ఆ కోణంలో జరిగినట్టు భావిస్తూ విచారణ ప్రారంభించామని పోలీసులు తెలిపారు.
Nalgonda District
Head
Murder
Bottuguda

More Telugu News