Poonam Kaur: 'డబ్బుల కోసం మారిపోయిన సిద్ధాంతాలు...' అంటూ పూనమ్ కౌర్ సంచలన వ్యాఖ్యలు

  • ఎవరి పేరూ చెప్పకుండా పూనమ్ వ్యాఖ్యలు
  • అవసరాల కోసం నిజాయతీ మారిపోయింది
  • మీ అస్తిత్వం ఏంటని ప్రశ్నలు!
ఎవరి గురించి మాట్లాడిందో తెలియదుగానీ, నటి పూనం కౌర్ సంచలన వ్యాఖ్యలనే చేసింది. "డబ్బుల కోసం మారిపోయిన సిద్ధాంతాలు... మీ అస్తిత్వం ఏంటి? అవసరాల కోసం మారిపోయిన నిజాయతీ... నీ గుణం ఏంటి?" అని ప్రశ్నించింది. ఇటీవలి కాలంలో కత్తి మహేష్, పవన్ అభిమానుల మధ్య జరిగిన మాటల యుద్ధంలో పూనమ్ కౌర్ కూడా చిక్కుకున్న సంగతి తెలిసిందే. పూనమ్ ను ఉద్దేశించి కత్తి మహేష్ వ్యక్తిగత విమర్శలు కూడా చేశాడు. ఆమెకు, పవన్ కల్యాణ్ కు మధ్య ఉన్న సంబంధాలపై ప్రశ్నలు లేవనెత్తాడు. ఈ నేపథ్యంలో ఎవరి పేరునూ ప్రస్తావించకుండా పూనమ్ చేసిన ఈ వ్యాఖ్యలు కలకలాన్ని రేపుతున్నాయి.
Poonam Kaur
Twitter

More Telugu News