nara: దేవాన్ష్ తో కలిసి జాతీయ జెండాను ఎగురవేసిన నారా భువనేశ్వరి

  • గణతంత్ర దినోత్సవం సందర్భంగా ఉండవల్లిలోని నివాసంలో జెండావిష్కరణ
  • ఇందిరాగాంధీ స్టేడియంలో వేడుకలకూ హాజరైన భువనేశ్వరి 
  • ప్రత్యేక ఆకర్షణగా దేవాన్ష్
ఏపీ సీఎం చంద్రబాబునాయుడు సతీమణి నారా భువనేశ్వరి, తమ మనవడు దేవాన్ష్ తో కలిసి జాతీయ జెండాను ఆవిష్కరించారు. గణతంత్ర దినోత్సవం సందర్భంగా ఉండవల్లిలోని తమ నివాసంలో జాతీయ జెండాను ఎగురవేశారు. మహాత్ముడి చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు.

కాగా, విజయవాడలోని ఇందిరాగాంధీ స్టేడియంలో జరిగిన గణతంత్ర దినోత్సవ వేడుకల్లో దేవాన్ష్ ప్రత్యేక ఆకర్షణగా నిలిచారు. ఈ వేడుకలకు భువనేశ్వరి తమ మనవడితో కలిసి హాజరయ్యారు. ఈ వేడుకల్లో అసెంబ్లీ స్పీకర్ కోడెల శివప్రసాదరావు, మంత్రులు చిన రాజప్ప, కళా వెంకట్రావు, కామినేని శ్రీనివాసరావు, దేవినేని ఉమ, కొల్లు రవీంద్ర, శిద్దా రాఘవరావు పాల్గొన్నారు.
nara
devanshu

More Telugu News