Balakrishna: ఏపీలోని తుళ్ళూరు ప్రాంతంలో బసవతారకం ఆసుపత్రికి శంకుస్థాపన చేస్తాం: నందమూరి బాలకృష్ణ

  • హైదరాబాద్ లోని బసవ తారకం ఆసుపత్రిలో గణతంత్ర వేడుకలు
  • జాతీయ జెండా ముందు ప్రజలంతా సమానమే
  • తుళ్ళూరు ప్రాంతంలో వచ్చే నెలలో శంకుస్థాపన: బాలకృష్ణ
ఏపీలోని తుళ్ళూరు ప్రాంతంలో వచ్చే నెలలో బసవతారకం ఆసుపత్రికి శంకుస్థాపన చేయనున్నట్టు టీడీపీ ఎమ్మెల్యే, ప్రముఖ సినీనటుడు నందమూరి బాలకృష్ణ తెలిపారు. హైదరాబాద్ లోని బసవ తారకం కేన్సర్ ఆసుపత్రిలో గణతంత్ర దినోత్సవ వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా జాతీయ జెండాను బాలకృష్ణ ఎగురవేశారు. అనంతరం, ఆయన మాట్లాడుతూ, జాతీయ జెండా ముందు ప్రజలంతా సమానమేనని అన్నారు. దేశం గురించి మాట్లాడేటప్పుడు, స్ఫూర్తిని పంచుకునేటప్పుడు అతిథులు ఎవరూ ఉండరని, అందరూ ఆత్మీయులేనని అన్నారు.
Balakrishna
Telugudesam
Hyderabad

More Telugu News