Sujana Chowdary: కేంద్ర మంత్రి సుజనా చౌదరికి తృటిలో తప్పిన పెను ప్రమాదం!

  • సుజానా కాన్వాయ్ లోకి తెలియని వాహనాలు
  • సడన్ బ్రేక్ వేసిన ఎస్కార్ట్ వాహన డ్రైవర్
  • బలంగా ఢీకొన్న సుజనా చౌదరి వాహనం
  • సీట్ బెల్ట్ పెట్టుకుని ఉండటంతో తప్పిన ప్రమాదం
విశాఖపట్నం విమానాశ్రయంలో దిగి, తన కాన్వాయ్ లో నగరానికి వస్తున్న కేంద్రమంత్రి సుజనా చౌదరికి తృటిలో పెను ప్రమాదం తప్పింది. నగర పరిధిలోని ఇందిరానగర్‌ వద్ద జాతీయ రహదారిపై సుజనా కాన్వాయ్‌ లోకి గుర్తు తెలియని రెండు కార్లు ఆకస్మికంగా వచ్చాయి. వాటిని కాన్వాయ్ నుంచి వేరు చేసేందుకు ఎస్కార్ట్‌ వాహనం డ్రైవర్‌ సడెన్‌ బ్రేక్‌ వేయడంతో, దాని వెనుకే వస్తున్న సుజనా కారు బలంగా ఢీకొంది. ఆ సమయంలో మంత్రి ముందు సీట్లో సీట్ బెల్టు పెట్టుకుని కూర్చుని ఉండటంతో పెద్ద ప్రమాదం తప్పింది. ఇక అదే వాహనంలో వెనుక సీట్లో ఉన్న అనకాపల్లి ఎంపీ అవంతి శ్రీనివాసరావుకు కూడా ఏమీ కాకపోవడంతో అందరూ ఊపిరి పీల్చుకున్నారు.
Sujana Chowdary
Vizag
Escort
Accident

More Telugu News