voters day: ఓటర్లుగా నమోదు చేసుకోండి... మన ప్రజాస్వామ్యాన్ని బలోపేతం చేయండి: మోదీ పిలుపు

  • ఓటుకున్న శక్తి అపారం
  • దాన్ని వినియోగించుకోవాలి
  • ఓటర్ల దినోత్సవం సందర్భంగా ప్రధాని పిలుపు
అర్హులైన ప్రతి ఒక్కరూ ఓటరుగా తమ పేరు నమోదు చేసుకోవాలని దేశ ప్రజలకు ప్రధాని మోదీ పిలుపునిచ్చారు. తద్వారా దేశ ప్రజాస్వామ్యాన్ని బలోపేతం చేయాలని కోరారు. జాతీయ ఓటర్ల దినోత్సవం సందర్భంగా ప్రధాని మోదీ తన సందేశాన్ని ఈ రోజు విడుదల చేశారు. ఎన్నికల సంఘం వార్షికోత్సవం సందర్భంగా అభినందనలు కూడా తెలియజేశారు.

‘‘అర్హులైన ఓటర్లందరినీ, ముఖ్యంగా యువతను నేను కోరేదేమంటే, తమ తమ పేర్లను నమోదు చేసుకుని ఎన్నికల్లో ఓటు వేయడం ద్వారా ప్రజాస్వామ్యాన్ని బలోపేతం చేయాలి’’ అంటూ మోదీ ట్వీట్ చేశారు. ఓటుకు ఉన్న శక్తి అపారమన్నారు. భారత ఎన్నికల సంఘం 1950 జనవరి 25న ఏర్పడగా, ఏటా ఈ రోజును ఓటర్ల దినోత్సవంగా జరుపుకుంటూ వస్తున్నారు.
voters day
Prime Minister
Narendra Modi

More Telugu News