pon radhakrushnan: కలాం స్మారక మందిరంలో రాజకీయాలొద్దు!: కమల్ కు కేంద్ర మంత్రి సూచన

  • ఫిబ్రవరి 21న రామనాధపురంలో పార్టీ ప్రకటిస్తానన్న కమల్ 
  • అబ్దుల్‌ కలాం స్మారకమందిరాన్ని రాజకీయాలకు వినియోగించరాదు
  • కమల్ ప్రకటన సరికాదన్న కేంద్రమంత్రి 
వచ్చేనెల 21 నుండి తన సొంతగడ్డ రామనాధపురంలో పార్టీని ప్రకటించి యాత్ర చేపడతానని ప్రముఖ నటుడు కమలహాసన్ ప్రకటించిన సగతి తెలిసిందే. దీనిపై కేంద్రమంత్రి పొన్ రాధాకృష్ణన్‌ నాగర్ కోయిల్ లో మాట్లాడుతూ, మాజీ రాష్ట్రపతి అబ్దుల్‌ కలాం స్మారక మందిరాన్ని రాజకీయాలకు వినియోగించరాదని సూచించారు.

జాతి, మత రాజకీయాలకు దూరంగా జీవనం సాగించిన అబ్దుల్‌ కలాం వంటి గొప్ప వ్యక్తి స్మారకమందిరంలో పార్టీ ప్రకటిస్తానని కమల్‌ ప్రకటన చేయడం సమంజసం కాదని ఆయన హితవు పలికారు. అలా చేయడం కలాం ప్రతిష్టను భంగపరచడమేనని ఆయన అభిప్రాయపడ్డారు. కమల్‌, రజనీల పార్టీలు తమిళనాట వందల పార్టీల్లో ఒకటిగా మిగులుతాయని ఆయన పేర్కొన్నారు. 
pon radhakrushnan
Kamal Haasan
party comments

More Telugu News