Get Instant Access to ap7am Free web app · Opens in one tap Install

అనుష్క ఎక్కడ ఉంటే అక్కడ కళకళే: ధన్ రాజ్

  • అనుష్క మంచి మనిషి 
  • అందరినీ ఆప్యాయంగా పలకరిస్తారు 
  • ఆమెను స్వీటీ అని ఎందుకు పిలుస్తారో అర్థమైంది
తెలుగు .. తమిళ భాషల్లో అనుష్కకి గల క్రేజ్ అంతా ఇంతా కాదు. ఆమె తాజా చిత్రంగా రూపొందిన 'భాగమతి' .. ఈ నెల 26వ తేదీన ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ నేపథ్యంలో ఈ సినిమాలో ఒక ముఖ్యమైన రోల్ చేసిన ధన్ రాజ్ స్పందించాడు. " నేను అనుష్కను దగ్గర నుంచి చూడటం ఈ సినిమా షూటింగ్ సమయంలోనే జరిగింది" అన్నాడు.

"సీనియర్ ఆర్టిస్టులు .. జూనియర్ ఆర్టిస్టులు అనే తేడాను చూపించకుండా ఆమె అందరితోనూ ఎంతో కలుపుగోలుగా వుంటారు. సెట్లో ఆమె ఎక్కడ వుంటే అక్కడ కళకళలాడిపోతూ ఉంటుంది. అందరినీ ఎంతో ఆప్యాయంగా పలకరిస్తూ .. ఎంతో సరదాగా వుంటారు. ఆమెను అంతా స్వీటీ అని ఎందుకు పిలుస్తారనేది నాకు ఇప్పుడు తెలిసింది. ఆమెతో కలిసి నటించడం నా అదృష్టంగా భావిస్తున్నాను. ఈ సినిమా ఆమెకి తప్పకుండా బ్లాక్ బస్టర్ హిట్ ఇస్తుందనే నమ్మకం వుంది" అని చెప్పుకొచ్చాడు.   
Anushka Shetty

More Telugu News