పాకిస్థాన్లో 'పద్మావత్' చిత్రానికి సెన్సార్ పూర్తి... 'యూ' సర్టిఫికెట్ జారీ
- అల్లా ఉద్దీన్ ఖిల్జీని తప్పుగా చూపించారంటూ అక్కడ కూడా అభ్యంతరం
- చరిత్రకారుడి సలహాతో అనుమతి జారీ చేసిన పాక్ సీబీఎఫ్సీ
- భారత్లో యూ/ఏ సర్టిఫికెట్
అల్లా ఉద్దీన్ ఖిల్జీని తప్పుగా చూపించారంటూ అభ్యంతరాలు వ్యక్తమవడంతో ఖైద్-ఈ-అజాం యూనివర్సిటీకి చెందిన చరిత్ర అధ్యాపకుడు వఖార్ అలీ షా సలహా మేరకు ఈ చిత్ర సెన్సార్ పూర్తి చేసినట్లు పాక్ సీబీఎఫ్సీ అధికారి మొబాషిర్ హసన్ తెలిపారు. మరోవైపు భారత్లో సినిమా విడుదలైనప్పటికీ బీజేపీ పాలిత రాష్ట్రాల్లో కర్ణిసేనలు విధ్వంసం సృష్టిస్తున్నారు. థియేటర్లను ధ్వంసం చేయడం వంటి హింసాత్మక చర్యలకు పాల్పడుతున్నారు.