Amala: తెలుగులో చక్కగా మాట్లాడుతున్న అక్కినేని అమల... వీడియో!

  • గతంలో తెలుగులో మాట్లాడేందుకు ఇబ్బంది
  • అమ్మపల్లిలో ఒడిసీ ఫెస్టివల్
  • చాలా అద్భుతంగా ఉందన్న అమల
అక్కినేని వారింటి కోడలు, నాగార్జున సతీమణి, జంతు సంరక్షకురాలు అక్కినేని అమల ఇప్పుడు తెలుగులో చక్కగా మాట్లాడేస్తున్నారు. గతంలో తెలుగులో మాట్లాడేందుకు కాస్తంత ఇబ్బంది పడిన ఆమె, భాషాపరంగా ఇప్పుడు మరింత మెరుగుపడ్డట్టు తెలుస్తోంది. అమ్మపల్లిలోని శ్రీరామచంద్ర ఆలయంలో సంప్రదాయ ఒడిసీ ఫెస్టివల్ జరుగగా, అమల పాల్గొన్నారు.

శ్రీలంక నుంచి, నిత్యాగ్రామ్ వచ్చిన నృత్య కారిణులు అద్భుతంగా తమ ప్రతిభను చాటారని చెప్పారు. చాలా అద్భుతంగా వారు నర్తించారని, శశిరెడ్డి, శ్రీనాగి ఈ కార్యక్రమాన్ని మంచి వాతావరణంలో ఏర్పాటు చేశారని, తానెంతో ఆనందించానని అన్నారు. అమల తెలుగులో మాట్లాడుతున్న వీడియోను మీరూ చూడవచ్చు.
Amala
Ammapalli
Odisee Dance

More Telugu News