bjp: విష్ణుకుమార్ రాజు చేసిన వ్యాఖ్యలపై బోండా ఉమ ఆగ్రహం

  • విష్ణుకుమార్ రాజు చేసిన వ్యాఖ్యలు అర్థరహితం
  • టీడీపీ, బీజేపీలు మిత్రపక్షాలు 
  • అటువంటప్పుడు వ్యక్తిగత వ్యాఖ్యలకు ఆస్కారం లేదు: బోండా
వైసీపీ నుంచి టీడీపీలోకి వచ్చి మంత్రులుగా ఉన్న వారంతా రాజీనామా చేయాలని, లేకపోతే పార్టీ ఫిరాయించిన వారు మంత్రులు కావచ్చని చట్టం తేవాలంటూ బీజేపీ ఎమ్మెల్యే విష్ణుకుమార్ రాజు చేసిన వ్యాఖ్యలపై తెలుగుదేశం పార్టీ నేత బోండా ఉమ మండిపడ్డారు. విష్ణుకుమార్ రాజు చేసిన వ్యాఖ్యలు అర్థరహితమని, వైసీపీ నుంచి టీడీపీలోకి వచ్చే ముందు ఆయా ఎమ్మెల్యేలు తమ రాజీనామా లేఖలను స్పీకర్ కు సమర్పించారని అన్నారు.

విష్ణుకుమార్ రాజు చేసిన వ్యాఖ్యలు ఆయన వ్యక్తిగతమని, రెండు పార్టీలు మిత్రపక్షాలుగా ఉన్నప్పుడు వ్యక్తిగత వ్యాఖ్యలకు ఆస్కారం లేదని అన్నారు. వైసీపీ నుంచి టీడీపీలోకి వచ్చిన ఎమ్మెల్యేలు తమ సభ్యత్వాలకు రాజీనామా చేశామని, స్పీకర్ ఆమోదిస్తే వచ్చే ఎన్నికల్లో పోటీ చేసేందుకు సిద్ధమని ఆ ఎమ్మెల్యేలు చెప్పిన విషయాన్ని బోండా ఉమ ప్రస్తావించారు.
bjp
vishnukumar raj
Telugudesam
Bonda Uma

More Telugu News