Pawan Kalyan: 'ఇక పూర్తి స్థాయి రాజకీయాల పైనే దృష్టి.. నో సినిమా' అని చెప్పేసిన పవన్ కల్యాణ్!

  • తెలంగాణలో మూడు రోజులపాటు పర్యటించిన పవన్ కల్యాణ్
  • నేను ఏ ఉద్దేశంతో పర్యటనకు వచ్చానో ఆ ప్రయత్నం చేశా
  • నాలోని భావాలను కార్యకర్తలకు చెప్పాను-పవన్
తెలంగాణలో మూడు రోజులపాటు పర్యటించిన సినీనటుడు పవన్ కల్యాణ్.. ఆరు జిల్లాలకు చెందిన తమ కార్యకర్తలతో సమావేశమై దిశానిర్దేశం చేసిన విషయం తెలిసిందే. ఈ సందర్భంగా పవన్ కల్యాణ్ ఓ ఇంటర్వ్యూలో మాట్లాడుతూ... తాను ఏ ఉద్దేశంతో వచ్చానో ఆ ప్రయత్నం చేశానని, ఇది మొదటి అడుగని అన్నారు.

తాననుకున్న భావాలను కార్యకర్తలకు తెలియజేశానని తెలిపారు. ప్రజాస్వామ్యబద్ధంగానే ముందుకు వెళుతున్నానని, తనకు ఎవ్వరి మీద ద్వేషం లేదని అన్నారు. సినిమాల్లోనూ న‌టిస్తారా? పూర్తి స్థాయిలో రాజ‌కీయాల్లో ఉంటారా? అని ఆయ‌న‌ను ప్ర‌శ్నించ‌గా పూర్తి స్థాయిలో రాజ‌కీయాల్లో ఉంటాన‌ని ఇప్ప‌టికే చెప్పేశాన‌ని స‌మాధానం ఇచ్చారు.             
Pawan Kalyan
politics
cinema
Jana Sena

More Telugu News