Pawan Kalyan: ‘తెలంగాణ’లో తిరిగేందుకు పవన్ ఎంత ప్యాకేజ్ మాట్లాడుకున్నారో చెప్పాలి?: గజ్టెల కాంతం

  • ప్రజలను మోసం చేసేందుకే జనసేన పార్టీ పెట్టారు
  • తెలంగాణ యువతను మభ్యపెట్టేందుకు పవన్ యాత్ర
  • ఈ రాష్ట్రం గురించి మాట్లాడే నైతికహక్కు ఆయనకు లేదు: గజ్జెల
జనసేన పార్టీ అధినేత పవన్ కల్యాణ్ పై ప్రజా సంఘాల జేఏసీ చైర్మన్ గజ్జెల కాంతం విమర్శలు గుప్పించారు. ఈరోజు ఆయన మీడియాతో మాట్లాడుతూ, ప్రజలను మోసం చేసేందుకే జనసేన పార్టీ పెట్టారని, తెలంగాణ యువతను మభ్యపెట్టేందుకు పవన్ తన యాత్ర చేపట్టాడని విమర్శించారు. ‘తెలంగాణ’లో తిరిగేందుకు పవన్ ఎంత ప్యాకేజ్ మాట్లాడుకున్నారో చెప్పాలి? అని ఆయన వ్యంగ్యాస్త్రాలు సంధించారు.

నాడు సిరిసిల్లలో దళితులపై దాడులు జరిగినప్పుడు, ఖమ్మంలో రైతులకు బేడీలు వేసినప్పుడు పవన్ కల్యాణ్ ఏమైపోయారని ప్రశ్నించారు. నాడు తెలంగాణ ఉద్యమంలో ప్రాణాలు కోల్పోయిన వారి గురించి, జైలుకెళ్లిన వారి గురించి పట్టించుకోని పవన్ కు ఈ రాష్ట్రం గురించి మాట్లాడే నైతిక హక్కు లేదని గజ్జెల కాంతం అన్నారు.
Pawan Kalyan
Telangana

More Telugu News