Pawan Kalyan: ప‌వ‌న్ కల్యాణ్ స‌భ‌లో తోపులాట.. తీవ్ర గందరగోళం!

  • ఖమ్మంలోని ఎంబీ గార్డెన్స్‌లో కార్యకర్తలతో పవన్ 
  • అభిమానుల అత్యుత్సాహం
  • బారికేడ్లు దాటి దూసుకొచ్చిన అభిమానులు
ఖమ్మంలోని ఎంబీ గార్డెన్స్‌లో సినీన‌టుడు, జ‌న‌సేన అధినేత ప‌వ‌న్ క‌ల్యాణ్‌ నిర్వహించిన స‌మావేశంలో తీవ్ర గంద‌ర‌గోళం నెల‌కొంది. పార్టీ కార్యకర్తల‌తో సమావేశంలో పాల్గొనేందుకు వ‌చ్చిన ప‌వ‌న్‌ను చూడడానికి బారికేడ్లు దాటి అభిమానులు దూసుకువ‌చ్చారు. దీంతో అక్క‌డ తోపులాట చోటు చేసుకుంది. అభిమానులను అదుపులోకి తెచ్చేందుకు పోలీసులు ప్ర‌య‌త్నిస్తున్నారు.

మరోపక్క, అభిమానులు అత్యుత్సాహం ప్రదర్శిస్తుండడం పట్ల ప‌వ‌న్ క‌ల్యాణ్ అసంతృప్తి వ్య‌క్తం చేశారు. కాగా, నిన్న‌ కరీంనగర్ లోని శుభమ్ గార్డెన్స్ లో నిజామాబాద్‌, ఆదిలాబాద్‌, క‌రీంన‌గ‌ర్ కార్య‌క‌ర్త‌ల‌తో స‌మావేశ‌మైన ప‌వ‌న్ ఈ రోజు ఉమ్మడి ఖమ్మం, వరంగల్‌, నల్గొండ జిల్లాల వారితో సమావేశం అయ్యారు.    
Pawan Kalyan
Khammam District
Jana Sena

More Telugu News