vikram: అసలు ధోతి కట్టుకోవడమే నాకు రాదు... ఇక రాజకీయాలేం చేస్తాను?: విక్రమ్‌

  • నేను చాలా సిగ్గరిని
  • నాకు రాజకీయాలు సరిపడవు
  • నటనకు వయసుతో సంబంధం ఉండదు
తమిళనాడులో రజనీకాంత్, కమలహాసన్‌తో పాటు పలువురు సినీనటులు రాజకీయాల్లోకి ఎంట్రీ ఇస్తోన్న విషయం తెలిసిందే. అయితే, సినీ నటుడు విక్రమ్ మాత్రం తనకు రాజకీయాలు వద్దని అంటున్నాడు. తాజాగా ఆయన ఓ ఇంటర్వ్యూలో మాట్లాడుతూ.. తాను చాలా సిగ్గరినని, కెమెరా ముందుంటే ఏమీ గుర్తుకు రాదు కాబట్టి, సినిమా సీన్‌లో లీనమైపోయి నటిస్తుంటానని చెప్పాడు. తనకు రాజకీయాలు సరిపడవని, అసలు ధోతి కట్టుకోవడమే తనకు రాదని, ఇక రాజకీయాలేం చేస్తానని ప్రశ్నించాడు. తనకు సినిమానే జీవితమని చెప్పుకొచ్చాడు.

కాగా, నటనకు వయసుతో సంబంధం ఉండబోదని, తాను ఎలాంటి పాత్రల్లో నటించడానికైనా సిద్ధమేనని విక్రమ్ చెప్పాడు. తన అబ్బాయి చేస్తోన్న ‘అర్జున్‌రెడ్డి’ రీమేక్‌ని తనతో తీస్తామని తన దగ్గరికి వచ్చి చెప్పినా తాను చేసుండేవాడినని, ఈ విషయంలో తనకు బాలీవుడ్ దిగ్గజ నటుడు అమితాబ్‌ బచ్చన్‌ స్ఫూర్తి అని చెప్పాడు.      
vikram
cinema
politics

More Telugu News