charan: ఆసక్తిని రేపుతోన్న 'రంగస్థలం' టీజర్!

  • చరణ్ తాజా చిత్రంగా 'రంగస్థలం'
  • రఫ్ లుక్ తో అదరగొట్టేస్తోన్న చరణ్ 
  • మార్చి 30వ తేదీన విడుదల
సుకుమార్ దర్శకత్వంలో చరణ్ కథానాయకుడిగా 'రంగస్థలం' తెరకెక్కుతోంది. షూటింగ్ పరంగా ఈ సినిమా ముగింపు దశకి చేరుకుంది. సమంత కథానాయికగా నటిస్తోన్న ఈ సినిమా నుంచి కొంత సేపటి క్రితం టీజర్ ను రిలీజ్ చేశారు. "నా పేరు చిట్టిబాబు అండీ .. ఈ ఊరుకి మనమే ఇంజనీరు' అంటూ తన పాత్రను తాను చరణ్ పరిచయం చేసుకోవడంతో టీజర్ మొదలవుతోంది.

'అందరికీ సౌండ్ వినపడుద్దండీ .. నాకు సౌండ్ కనపడుద్దండీ .. అందుకేనండి ఊళ్లో అందరూ మనల్ని సౌండ్ ఇంజనీర్' అంటారు. మా ఊరు 'రంగస్థలం' అని చరణ్ చెప్పుకోవడం పైనే పూర్తి టీజర్ ను కట్ చేశారు. రఫ్ లుక్ తో చరణ్ ఆకట్టుకుంటున్నాడు. చరణ్ పాత్రకి వినికిడి లోపం ఉందనే విషయాన్ని ఈ టీజర్ తో స్పష్టం చేశారు. చరణ్ పాత్రను మాత్రమే జనంలోకి తీసుకెళ్లే ప్రయత్నంగా ఈ టీజర్ ను వదిలారు. మెగా అభిమానులను అలరించే విధంగానే ఈ టీజర్ ఉందని చెప్పొచ్చు. మార్చి 30వ తేదీన ఈ సినిమాను ప్రేక్షకుల ముందుకు తీసుకురానున్నారు. 
charan
samanta

More Telugu News