అనుమతి లేకుండా నగరాన్ని వీడొద్దు... నీతి తప్పిన ఏఎస్పీ సునీతా రెడ్డికి ఆదేశం!
- కల్వకుర్తి సీఐతో ఏసీబీ ఏఎస్పీ సునీత వివాహేతర సంబంధం
- రెడ్ హ్యాండెడ్ గా పట్టుకున్న సునీత భర్త
- ఇద్దరినీ సస్పెండ్ చేస్తూ ప్రభుత్వ ముఖ్య కార్యదర్శి అజయ్‌మిశ్రా ఉత్తర్వులు
- సునీతపై ఆంక్షలు విధించిన అధికారులు
పోలీస్ శాఖ ప్రతిష్ఠకు భంగం కలిగించేలా ఇద్దరూ ప్రవర్తించారని భావించిన అధికారులు, వారిద్దరినీ సస్పెండ్ చేశారు. ప్రభుత్వ ముఖ్య కార్యదర్శి అజయ్‌మిశ్రా పేరిట జారీ అయిన ఈ ఉత్తర్వుల్లో, సస్పెన్షన్ అమలులో ఉన్నంత కాలంలో ముందస్తు అనుమతి లేకుండా హైదరాబాద్ నగరాన్ని వీడవద్దని సునీతను ఆదేశించారు. సీఐపై నమోదైన కేసు ఎఫ్ఐఆర్ లో ఆమె పేరుండటం, ఆమె అనైతికంగా ప్రవర్తించిందన్న ఆరోపణలకు సాక్ష్యాలు ఉన్నాయని పోలీసు అధికారులు అంటున్నారు.