Pawan Kalyan: మా అన్నయ్య కూడా కాంగ్రెస్ పార్టీలోనే ఉన్నారు.. గుర్తుంచుకోండి!: పవన్ కల్యాణ్

  • కేసీఆర్ ను కలవడాన్ని కొందరు విమర్శించారు
  • నాకు ఎవరిపై ద్వేషం లేదు
  • అన్ని పార్టీలపై అభిమానం ఉంది
తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ ను తాను కలవడం పట్ల కొందరు రాజకీయ నేతలు, ముఖ్యంగా కాంగ్రెస్ వారు తనను విమర్శించారని జనసేన అధినేత పవన్ కల్యాణ్ అన్నారు. తనను విమర్శించిన వారందరికీ తాను ఒక్కటే చెప్పదలుచుకున్నానని... ప్రజల కోసం పోరాడే ప్రతి ఒక్క నేతనూ తాను ఇష్టపడతానని చెప్పారు.

తెలంగాణ సాధనలో కేసీఆర్ పాత్ర కూడా ఉందని తెలిపారు. తన అన్నయ్య చిరంజీవి కూడా కాంగ్రెస్ పార్టీలోనే ఉన్నారన్న సంగతిని ఆ పార్టీ నేతలు గుర్తు పెట్టుకోవాలని కోరారు. తనకు అన్ని పార్టీలమీద అభిమానం ఉందని... ఎవరిమీదా తనకు ద్వేషం లేదని చెప్పారు. కరీంనగర్ లో జనసేన కార్యకర్తలతో నిర్వహించిన కార్యక్రమంలో ప్రసంగిస్తూ ఆయన పైవ్యాఖ్యలు చేశారు. 
Pawan Kalyan
Chiranjeevi
janasena

More Telugu News