Pawan Kalyan: జనసేనానికి మద్దతుగా కోన వెంకట్, బండ్ల గణేశ్, సంపూర్ణేష్ బాబు ట్వీట్లు!

షార్ట్స్‌లో చూడండి
జనసేన పార్టీ అధినేత పవన్ కల్యాణ్ రాజకీయ యాత్ర నిన్న ప్రారంభమైన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో పవన్ కు ప్రముఖ సినీ రచయిత, దర్శకుడు కోన వెంకట్, నిర్మాత బండ్ల గణేశ్, హాస్యనటుడు సంపూర్ణేష్ బాబు తమ మద్దతు తెలిపారు. ఈ మేరకు సామాజిక మాధ్యమాల్లో వేర్వేరు పోస్ట్ లు చేశారు.

‘నడక మొదలైంది.. గమ్యం ఎదురుచూస్తుంది మిత్రమా!!’ అని తన ట్వీట్ లో కోన వెంకట్, ‘పవర్ ఆఫ్ పవన్ కల్యాణ్..’ అని బండ్ల గణేష్ తమ ట్వీట్లలో పేర్కొన్నారు. ఈ సందర్భంగా పవన్ కల్యాణ్ ఫొటోలను పోస్ట్ చేశారు. ఇక, హాస్యనటుడు సంపూర్ణేష్ బాబు తన ఫేస్ బుక్ ఖాతాలో చెబుతూ.. ‘ఎట్టకేలకు, లీడర్ ని కలిశాను.. మీ మాటలు స్ఫూర్తి దాయకం. మీ బాటలోనే మేము..’ అని పేర్కొంటూ, పవన్ తో తాను కలిసి దిగిన ఒక ఫొటోను పోస్ట్ చేశాడు.

Go Back to Shorts
Pawan Kalyan
Tollywood

More Telugu News