Get Instant Access to ap7am Free web app · Opens in one tap Install

సినిమా కబుర్లు.. సంక్షిప్త సమాచారం!

  • అమెరికాలో భారీ ఎత్తున అనుష్క సినిమా రిలీజ్ 
  • బన్నీ సినిమా రిలీజ్ వాయిదా?
  • సావిత్రి తల్లిగా నిన్నటి కథానాయిక 
  • ఆర్టిస్టుగా రకుల్ సోదరుడి అరంగేట్రం 
*  స్వీటీ అనుష్క నటించిన 'భాగమతి' చిత్రాన్ని అమెరికాలో భారీ ఎత్తున రిలీజ్ చేస్తున్నారు. సుమారు 125 లొకేషన్లలో అక్కడ విడుదల చేయడానికి ఏర్పాట్లు చేస్తున్నారట. 'పిల్ల జమీందార్' ఫేం అశోక్ దర్శకత్వంలో ఇది రూపొందింది.    
*  అల్లు అర్జున్ నటిస్తున్న 'నా పేరు సూర్య' చిత్రం రిలీజ్ డేట్ మారనున్నట్టు తెలుస్తోంది. మొదట్లో ఈ చిత్రాన్ని ఏప్రిల్ 27న రిలీజ్ చేయనున్నట్టు ప్రకటించారు. అయితే అదే రోజున 'భరత్ అనే నేను', '2.o' చిత్రాలు కూడా రిలీజవుతున్నందున బన్నీ చిత్రాన్ని వాయిదా వేయడానికి నిర్ణయించినట్టు సమాచారం.  
*  నిన్నటితరం కథానాయిక దివ్యవాణి మళ్లీ ఇప్పుడు నటిగా బిజీ అవుతోంది. కొన్ని సీరియల్స్ లో నటిస్తూనే సినిమాలలో కూడా నటిస్తోంది. ఈ క్రమంలో సావిత్రి బయోపిక్ 'మహానటి' చిత్రంలో సావిత్రి తల్లి పాత్రలో నటిస్తోంది. మంచి పాత్రలు వస్తే మరిన్ని చిత్రాలలో నటిస్తానని దివ్యవాణి చెప్పింది.
*  కథానాయిక రకుల్ ప్రీత్ సింగ్ సోదరుడు అమన్ కూడా నటుడిగా మారాడు. 'సెడిషన్' పేరుతో రూపొందుతున్న హిందీ, ఇంగ్లిష్ ద్విభాషా చిత్రంలో ఆర్టిస్టుగా పరిచయం అవుతున్నాడు. త్వరలో తెలుగు సినిమాలలో కూడా నటించాలని కోరుకుంటున్నాడు.
     
Anushka Shetty
Allu Arjun
rakul

More Telugu News