Pawan Kalyan: 40 నుంచి 150 కార్లకు పెరిగిన పవన్ కాన్వాయ్... కరీంనగర్ హైవేపై పరుగులు!

  • కాన్వాయ్ లో చేరుతున్న అభిమానుల వాహనాలు
  • అభిమానులు కనిపిస్తే అభివాదం చేస్తున్న పవన్
  • నిదానంగా సాగుతున్న పవన్ ప్రయాణం
ఈ ఉదయం 9 గంటల సమయంలో హైదరాబాద్ లోని జనసేన కార్యాలయం నుంచి కొండగట్టు అంజన్న దర్శనం నిమిత్తం పవన్ కల్యాణ్ బయలుదేరిన వేళ, భారీ సంఖ్యలో పవన్ అభిమానులు, కార్యకర్తలు ఆయన వెంట తరలి వెళుతున్నారు. పవన్ కాన్వాయ్ ప్రారంభంలో సుమారు 40 కార్లలో అభిమానులు ఆయన వెంట పయనం కాగా, హైదరాబాద్ శివార్లకు చేరేసరికి, మరో 100కు పైగా వాహనాలు కాన్వాయ్ లోకి వచ్చి చేరాయి.

వివిధ ప్రాంతాల్లో ఉన్న అభిమానులు, పవన్ కాన్వాయ్ లో కలవడంతో, సుమారు 150 వాహనాల భారీ కాన్వాయ్, ఇప్పుడు కరీంనగర్ జాతీయ రహదారిపై పరుగులు తీస్తోంది. దారి మధ్యలో అభిమానులు పెద్ద సంఖ్యలో కనిపించిన చోటెల్లా, కారును ఆపి వారిని పలకరిస్తూ పవన్ ముందుకు సాగుతున్నారు. కాన్వాయ్ నిదానంగా సాగుతుండడంతో మధ్యాహ్నం 3 గంటల తరువాతే ఆయన కొండగట్టుకు చేరే అవకాశాలు ఉన్నట్టు తెలుస్తోంది.
Pawan Kalyan
Janasena
Kondagattu

More Telugu News