actor naresh: 2019 ఎన్నికల్లో సినిమా వారు ప్రభావం చూపుతారు.. సేవాభావం కలవారికి మద్దతిస్తా: నటుడు నరేష్

  • ఎంపీ, ఎమ్మెల్యే కావాలన్న కోరిక లేదు
  • మంచి వ్యక్తులకు మద్దతిస్తా
  • సినిమాలతో సంతోషంగా ఉన్నా
రానున్న ఎన్నికల్లో రాజకీయ రుతుపవనాలు సినీ రంగం నుంచే వీస్తాయని నటుడు సీనియర్ నరేష్ అన్నారు. సేవాభావంతో రాజకీయాల్లోకి వచ్చే వారికి తాను మద్దతిస్తానని చెప్పారు. సినీ రంగానికి చెందిన ఎన్టీఆర్, ఎమ్జీఆర్, జయలలితలు రాజకీయ రంగంలోకి వచ్చి ప్రజలకు విశిష్టమైన సేవ చేశారని తెలిపారు. ప్రాంతీయ పార్టీలు కూడా మరింత బలపడాల్సిన అవసరం ఉందని చెప్పారు.

బీజేపీలో తాను అనేక బాధ్యతలను నిర్వర్తించానని... తనకు ఎంపీ, ఎమ్మెల్యే కావాలనే కోరిక లేదని అన్నారు. సినీ రంగంలో చాలా సంతోషంగా ఉన్నానని... సినిమాలు చేస్తూనే రాజకీయరంగంలో ఉంటానని చెప్పారు. క్రియాశీలక రాజకీయాల్లో మాత్రం ఉండబోనని తెలిపారు. ప్రస్తుతం 'పవనిజం' అనే సినిమాలో తాను ఒక మంచి పాత్రను పోషిస్తున్నానని చెప్పారు.
actor naresh

More Telugu News