kalyani priyadarshan: 'హలో' హీరోయిన్ కి పెరుగుతోన్న ఆఫర్లు

  • 'హలో' మూవీతో కల్యాణి ప్రియదర్శన్ కి క్రేజ్ 
  • ఆమె పైనే దర్శక నిర్మాతల దృష్టి 
  • తమిళ .. మలయాళం నుంచి పెరుగుతోన్న ఆఫర్లు
విక్రమ్ కుమార్ దర్శకత్వంలో వచ్చిన 'హలో' చిత్రంతో కల్యాణి ప్రియదర్శన్ కథానాయికగా పరిచయమైంది. ఈ సినిమా ఆశించిన స్థాయిలో వసూళ్లు రాబట్టలేకపోయినప్పటికీ, కథానాయికగా కల్యాణికి మంచి మార్కులు పడ్డాయి. కొత్తగా లవ్ స్టోరీస్ ను తెరకెక్కించాలనుకుంటోన్న దర్శక నిర్మాతలు ముందుగా కల్యాణి పేరునే పరిశీలిస్తున్నట్టుగా సమాచారం.

యువ కథానాయకులు తమ సినిమాల్లో హీరోయిన్ గా ఈ అమ్మాయి వుంటే బాగుంటుందనే ఉత్సాహాన్ని వ్యక్తం చేస్తున్నారట. ఇక తమిళ .. మలయాళ భాషల నుంచి కూడా అమ్మాయికి మంచి ఆఫర్లే వస్తున్నాయని అంటున్నారు. అయితే కల్యాణికి గల నేపథ్యం కారణంగా ఆమె హడావిడిపడిపోయి సినిమాలు చేయవలసిన అవసరం లేదు. అందుకే ముందుగా తెలుగు సినిమాలకే ప్రాధాన్యతనిస్తాననీ, నచ్చిన పాత్రలను మాత్రమే చేస్తానని చెబుతోంది.    
kalyani priyadarshan

More Telugu News