hero vishal: రాజకీయవేత్తగా ఈ విషయం చెప్పడం లేదు.. ప్రజల ప్రతినిధిగా చెబుతున్నా: హీరో విశాల్

  • రాజకీయాల్లోకి వస్తున్నా
  • తమిళ రాజకీయాల్లో పెను మార్పులు తథ్యం
  • ఆర్కే నగర్ లో నామినేషన్ తిరస్కరణ దారుణం
ఆర్కే నగర్ ఉపఎన్నికలో ఒక రాజకీయవేత్తగా తాను పోటీ చేయలేదని... ఆ నియోజకవర్గ ప్రజలకు సేవ చేయాలనే లక్ష్యంతోనే బరిలోకి దిగానని హీరో విశాల్ అన్నాడు. రాజకీయ రంగంలోకి దిగాలనే తన నిర్ణయానికి కారణమైన వారందరికీ ఈ సందర్భంగా ధన్యవాదాలు తెలుపుకుంటున్నానని చెప్పాడు. వచ్చే శాసనసభ ఎన్నికల్లో తమిళనాడులో పెను మార్పులు చోటు చేసుకుంటాయని తెలిపాడు. రానున్న రోజుల్లో తాను కూడా రాజకీయాల్లోకి వస్తున్నానని విశాల్ స్పష్టం చేశాడు. ఆర్కే నగర్ ఉపఎన్నికలో తన నామినేషన్ విషయంలో అన్యాయం జరిగిందని... తాను ఈ నిర్ణయం తీసుకోవడానికి ఆ అవకతవకలే కారణమని చెప్పాడు. 
hero vishal
kollywood
tollywood

More Telugu News