విడిపోయిన తరువాత వచ్చిన అతి పెద్ద చిక్కు ఇదే: చంద్రబాబునాయుడు
- అమరావతిలో రెండో రోజు మొదలైన కలెక్టర్ల కాన్ఫరెన్స్
- దక్షిణాదిలో అతి తక్కువ తలసరి ఏపీలోనే
- ఆదుకోవాలని కేంద్రాన్ని కోరుతూనే ఉన్నా
- న్యాయం జరుగకుంటే పోరాటానికి సిద్ధం
ఈ విషయంలో తాను ఎప్పటికప్పుడు కేంద్రానికి పరిస్థితిని వివరిస్తూనే ఉన్నానని, న్యాయం జరుగకుంటే, అవసరాన్ని బట్టి సుప్రీంకోర్టుకు వెళ్లేందుకు కూడా సిద్ధమేనని చంద్రబాబు తేల్చి చెప్పారు. దక్షిణ భారత దేశంలో అత్యంత తక్కువ తలసరి ఆదాయం ఉన్నది ఏపీలోనేనని, ఇందుకు ప్రజలు కారణం కాదని, విభజనతో వచ్చిన కష్టమే ఇదని తెలిపారు.