స్మృతి ఇరానీకి గుణపాఠం నేర్పండి: రోహిత్ వేముల తల్లికి జిగ్నేష్ మేవాని విజ్ఞప్తి
- రాధికమ్మ ఎన్నికల్లో పోటీ చేయాలి
- పార్లమెంటులో స్మృతికి గుణపాఠం నేర్పాలి
- మోదీ ప్రభుత్వం మూల్యం చెల్లించుకోక తప్పదు
రోహిత్ వేముల రెండో వర్ధంతి సందర్భంగా హైదరాబాద్ కు వచ్చినప్పుడు ఆయన తల్లి రాధికమ్మను జిగ్నేష్ కలిశారు. ఆ సందర్భంగా జిగ్నేష్ మాట్లాడుతూ, కర్ణాటక అసెంబ్లీ ఎన్నికల ప్రచారంలో రాధికమ్మ పాల్గొంటారని ఆయన అన్నారు. బీజేపీ ఓటమే తమ అంతిమ లక్ష్యమని తెలిపారు. దళిత వ్యతిరేక చర్యలను చేపడుతున్న మోదీ ప్రభుత్వం మూల్యం చెల్లించుకోక తప్పదని అన్నారు. దళిత ఉద్యమం దేశంలోని అన్ని మూలలకు వ్యాపించాల్సిన అవసరం ఉందని చెప్పారు.