రెండో టెస్టులో గెలిచి సిరీస్ కైవసం చేసుకున్న దక్షిణాఫ్రికా

  • 135 పరుగుల తేడాతో భారత్ ఓటమి
  • దక్షిణాఫ్రికా బౌలర్లలో ఎన్గిడీకి 6 వికెట్లు 
  • మొదటి ఇన్నింగ్స్ లో దక్షిణాఫ్రికా 335, రెండో ఇన్నింగ్స్‌లో 258 పరుగులు 
  • భారత్ మొదటి ఇన్నింగ్స్‌లో 307, రెండో ఇన్నింగ్స్‌లో 151
సెంచూరియన్‌లో భారత్, దక్షిణాఫ్రికా మధ్య జరిగిన రెండో టెస్టులో టీమిండియా 135 పరుగుల తేడాతో ఓటమిపాలైంది. దీంతో మూడు టెస్టుల సిరీస్‌ను 2-0 తేడాతో దక్షిణాఫ్రికా కైవసం చేసుకుంది. రెండో ఇన్నింగ్స్‌లో భారత బ్యాట్స్‌మెన్‌లో మురళీ విజయ్ 9, లోకేశ్ రాహుల్ 4, పుజారా 19, విరాట్ కోహ్లీ 5, పార్థివ్ పటేల్ 19, హార్దిక్ పాండ్యా 6, రవి చంద్రన్ అశ్విన్ 3, రోహిత్ శర్మ 47, షమీ 28, ఇషాంత్ శర్మ 4 (నాటౌట్), బుమ్రా 2 పరుగులు చేశారు. దక్షిణాఫ్రికా బౌలర్లలో ఎన్గిడీ 6 వికెట్లు తీయగా రబాడా 3 వికెట్లు తీశాడు. మొదటి ఇన్నింగ్స్ లో దక్షిణాఫ్రికా 335, రెండో ఇన్నింగ్స్‌లో 258 పరుగులు చేయగా, భారత్ మొదటి ఇన్నింగ్స్‌లో 307, రెండో ఇన్నింగ్స్‌లో 151 పరుగులు చేసింది.
Go Back to Shorts
India
south africa
Cricket

More Telugu News