India: సెంచూరియన్‌ టెస్టు: ఓటమి దిశగా టీమిండియా

  • ప్రస్తుతం భారత స్కోరు 122/7 (43ఓవర్లు)
  • దక్షిణాఫ్రికా బౌలర్లలో ఎన్గిడీకి 4 వికెట్లు
  • క్రీజులో రోహిత్ శర్మ (32), షమీ (18)
సెంచూరియన్‌లో జరుగుతోన్న భారత్, దక్షిణాఫ్రికా రెండో టెస్టు రెండో ఇన్నింగ్స్‌లోనూ టీమిండియా బ్యాట్స్ మెన్ చతికిలపడ్డారు. మొదటి ఇన్నింగ్స్ లో దక్షిణాఫ్రికా 335 పరుగులు చేసి ఆలౌట్ కాగా, భారత్ 307 పరుగులకే ఆలౌటైన విషయం తెలిసిందే. దక్షిణాఫ్రికా రెండో ఇన్సింగ్స్ లో 258 పరుగులు చేయడంతో భారత్ 287 పరుగుల లక్ష్య ఛేదనలో బ్యాటింగ్ ప్రారంభించి ఘోరంగా విఫలమవుతోంది.

మురళీ విజయ్ 9, లోకేశ్ రాహుల్ 4, పుజారా 19, విరాట్ కోహ్లీ 5, పార్థివ్ పటేల్ 19, హార్దిక్ పాండ్యా 6, రవి చంద్రన్ అశ్విన్ 3 పరుగుల వ్యక్తిగత స్కోరుకే అవుట్ అయ్యారు. ప్రస్తుతం క్రీజులో రోహిత్ శర్మ 32, షమీ 18 పరుగులతో ఉన్నారు. దక్షిణాఫ్రికా బౌలర్లలో ఎన్గిడీ 4 వికెట్లు తీయగా రబాడా 2 వికెట్లు తీశాడు. ప్రస్తుతం భారత స్కోరు 122/7 (43ఓవర్లు) గా ఉంది.
India
south africa
Cricket

More Telugu News