jimmy: 11 నెలల పాలనలో 2 వేల అబద్ధాలు చెప్పిన ట్రంప్.. వీడియో చూడండి!
- డాక్యుమెంటరీ రూపొందించిన జిమ్మీ కిమ్మెల్
- తన కార్యక్రమంలో ప్రసారం చేసిన జిమ్మీ
- ఒకరోజుకి సరాసరిగా 5.6 అబద్ధాలు చెప్పినట్లు వివరణ
అమెరికా అధ్యక్షుడిగా ఎన్నికైన నాటి నుంచి 'నన్ను నమ్మండి' అంటూనే తన 11 నెలల పాలనా కాలంలో డొనాల్డ్ ట్రంప్ 2000ల అబద్ధాలు చెప్పాడని ప్రముఖ వ్యాఖ్యాత జిమ్మీ కిమ్మెల్ వివరించారు. ఈ మేరకు ట్రంప్ అబద్ధాల డాక్యుమెంటరీ వీడియోను తన కార్యక్రమం 'జిమ్మీ కిమ్మెల్ లైవ్'లో ప్రసారం చేశారు. దీనికి 'ప్యాంట్స్ ఆఫ్ ఫైర్: ద రోడ్ టు 2000 లైస్' అని పేరు పెట్టారు.
జిమ్మీ కిమ్మెల్ విశ్లేషణ ప్రకారం ట్రంప్ ఒకరోజుకి సరాసరిగా 5.6 అబద్ధాలు చెప్పారు. అలాగే ట్రంప్ తన 1000వ అబద్ధాన్ని గత ఆగస్టులో చెప్పారని, జనవరి 9న 2000వ అబద్ధం చెప్పి రికార్డు సృష్టించారని కిమ్మెల్ తెలిపారు.