sai pallavi: దిల్ రాజు సినిమాను తిరస్కరించడానికి కారణం ఇదే: సాయి పల్లవి

  • దిల్ రాజు సినిమా కథ నచ్చలేదు
  • నచ్చకపోతే సినిమా చేయను
  • ఎవరేమనుకున్నా నాకు అనవసరం
'ఫిదా' సినిమాతో తెలుగు ప్రేక్షకులందరినీ ఫిదా చేసింది సాయి పల్లవి. చూడగానే మన పక్కింటి అమ్మాయిలా కనిపించే పల్లవి... ఇప్పుడు తెలుగువారందరికీ ఫేవరెట్ నటి అనడంలో సందేహం లేదు. గ్లామర్ షోకు ససేమిరా అనే ఆమె... కేవలం నటనతోనే అందరికీ చేరువైంది. తాజాగా నిర్మాత దిల్ రాజు సినిమాకు ఆమె నో చెప్పింది. దిల్ రాజు సినిమా అంటే ఏ హీరో అయినా, హీరోయిన్ అయినా ఎగిరి గంతేస్తారు. కానీ, పల్లవి మాత్రం  ఆఫర్ ను తిరస్కరించింది. తాజాగా దీనికి కారణమేంటో సాయి పల్లవి వెల్లడించింది.

తనకు నచ్చితేనే సినిమా చేస్తానని... నచ్చకపోతే ఎవరు బలవంతం చేసినా చేయనని పల్లవి తెలిపింది. దిల్ రాజు సినిమా కథ తనకు నచ్చలేదని కుండబద్దలు కొట్టినట్టు చెప్పింది. తనకు తక్కువ రెమ్యునరేషన్ ఆఫర్ చేశారని కొందరు, చాలా ఎక్కువ ఆఫర్ చేసినా తిరస్కరించానని మరికొందరు... ఇలా ఎవరికి తోచినట్టు వారు ప్రచారం చేస్తున్నారని... ఎవరేమనుకున్నా తనకు అనవసరమని, కథ నచ్చకపోతే సినిమా చేయనని స్పష్టం చేసింది. 
sai pallavi
tollywood
Dil Raju

More Telugu News