srinivas: 'సాక్ష్యం' ఫస్టులుక్ రిలీజ్ డేట్ ఖరారు!

  • శ్రీవాస్ దర్శకత్వంలో శ్రీనివాస్
  • షూటింగు దశలో 'సాక్ష్యం'
  • ఫస్టులుక్ రిలీజ్ కి సన్నాహాలు          
శ్రీవాస్ దర్శకత్వంలో బెల్లంకొండ శ్రీనివాస్ కథానాయకుడిగా 'సాక్ష్యం' సినిమా తెరకెక్కుతోంది. పంచభూతాలతో ముడిపడిన కథాంశంతో రూపొందుతోన్న ఈ సినిమాలో, కథానాయికగా పూజా హెగ్డే నటిస్తోంది. సంక్రాంతికి ఈ సినిమా నుంచి ఫస్టులుక్ రావొచ్చని అనుకున్నారు .. కానీ అలాంటిదేమీ జరగలేదు.

ఈ సినిమా ఫస్టులుక్ ను ఈ నెల 26వ తేదీన విడుదల చేయనున్నట్టు కొంతసేపటి క్రితమే అభిషేక్ పిక్చర్స్ వారు అధికారికంగా ప్రకటించారు. అందుకు సంబంధించిన పోస్టర్ ను కూడా వదిలారు. జగపతిబాబు .. మీనా .. శరత్ కుమార్ ముఖ్య భూమికలు పోషిస్తున్నారు. విడుదల తేదీని కూడా త్వరలోనే ప్రకటించనున్నారు.          
srinivas
pooja hegde

More Telugu News