Get Instant Access to ap7am Free web app · Opens in one tap Install

విమాన ప్రయాణికులకు ఎయిర్‌ఏషియా అద్భుత‌ ఆఫర్‌!

  • భార‌త్‌లోని ఏడు నగరాల్లో అందించే స‌ర్వీసుల‌కు రూ.99కే టికెట్
  • నేటి నుంచి ఈ నెల 21 వరకు టికెట్‌ బుకింగ్స్
  • నేటి నుంచి జులై 31 మధ్యకాలంలో ప్రయాణ సదుపాయం
భార‌త్‌లోని ఏడు నగరాల్లో అందించే స‌ర్వీసుల‌పై మలేషియాకు చెందిన విమానయాన సంస్థ ఎయిర్‌ఏషియా అద్భుత‌ ఆఫర్‌ను అందిస్తోంది. బెంగళూరు, హైదరాబాద్‌, కొచ్చి, కోల్‌కతా, న్యూ ఢిల్లీ, పూణె, రాంచీ ప్రాంతాల్లో రూ.99కే (బేస్‌ ఛార్జి) టికెట్ అందిస్తున్న‌ట్లు తెలిపింది. ఈ ఆఫ‌ర్‌ను అందుకోవాలంటే నేటి నుంచి ఈ నెల 21 వరకు టికెట్‌ బుక్‌ చేసుకోవచ్చు. టికెట్‌ బుక్‌ చేసుకున్న వారు నేటి నుంచి జులై 31 మధ్యకాలంలో ప్రయాణించవచ్చు.

దీనితో పాటు ఎయిర్ఏసియా మరో ఆఫర్‌ను కూడా తీసుకొచ్చింది. ఆక్లాండ్‌, బాలి, బ్యాంకాంక్‌, కౌలాలంపూర్‌, మెల్‌బోర్న్‌, సింగపూర్‌, సిడ్నీ నగరాలకు వెళ్లాలనుకునే ప్రయాణికులకు రూ.1,499(బేస్‌ఛార్జి)కే టికెట్‌ అందిస్తున్నట్లు పేర్కొంది. మరిన్ని వివరాలకు, టికెట్ల బుకింగ్ కోసం ఎయిర్‌ఏషియా.కామ్ వెబ్‌సైట్ చూడొచ్చు. 
air asia
offer
India

More Telugu News