'మా పెళ్లి స్వర్గంలో జరిగింది... ఓసారి గొడవైనా ఏమీ కాదు':.. ఆసక్తికర వ్యాఖ్యలు చేసిన నెతన్యాహూ!
- దౌత్య బంధాన్ని బలపరచుకోవడమే లక్ష్యం
- ఇండియా పర్యటనకు వచ్చిన ఇజ్రాయెల్ ప్రధాని
- జరూసలేంకు వ్యతిరేకంగా ఐరాసలో భారత్ ఓటు
- అదేమీ సమస్య కాబోదన్న నెతన్యాహూ
జరూసలేం విషయంలో భారత వైఖరిపై కొంత అసంతృప్తి ఉన్నా, రెండు దేశాల మధ్యా సంబంధాలపై ప్రభావం ఉండబోదని తేల్చి చెప్పారు. ప్రధాని నరేంద్ర మోదీ ఓ గొప్ప నేతని కితాబిచ్చారు. కాగా, టెక్నాలజీ, వ్యవసాయం తదితర రంగాల్లో ఇరు దేశాల మధ్యా నేడు కీలక ఒప్పందాలు కుదిరే అవకాశాలు ఉన్నాయి. ఈ ఉదయం ప్రధాని మోదీతో నెతన్యాహూ సమావేశం కానుండగా, ప్రతినిధుల స్థాయి సమావేశం జరగనుంది. ట్యాంకుల విధ్వంసక క్షిపణుల తయారీపై ఒప్పందం కుదిరే అవకాశాలు ఉన్నాయి.