సినిమాకు వెళ్లిన మూడు కుటుంబాలు... వచ్చేలోగా గుల్ల చేసిన చోరులు!
- రెచ్చిపోయిన చోరాగ్రేసరులు
- రాజేంద్రనగర్ లో ఐదు ఇళ్లలో దోపిడీ
- సీసీటీవీ ఫుటేజ్ లు పరిశీలిస్తున్న పోలీసులు
రెండు కుటుంబాలు పండగ నిమిత్తం ఊరికి వెళ్లగా, మిగతా మూడు కుటుంబాలూ సినిమాకు వెళ్లాయి. సినిమా నుంచి తిరిగి వచ్చే సరికి ఆ ఇళ్లలో దొంగతనాలను పూర్తి చేసుకున్న దొంగలు దర్జాగా వెళ్లిపోయారు. తాళాలను పగులగొట్టి 40 తులాల బంగారాన్ని, దొరికినంత నగదును అపహరించుకుపోయారు. బాధితుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసిన పోలీసులు దొంగల కోసం అందుబాటులోని సీసీటీవీ ఫుటేజ్ లను పరిశీలిస్తున్నారు.