త్రివిక్రమ్ కు ఫోన్ చేసి ధైర్యం చెప్పిన ఎన్టీఆర్!
Get Instant Access to ap7am Free web app · Opens in one tap Install

త్రివిక్రమ్ కు ఫోన్ చేసి ధైర్యం చెప్పిన ఎన్టీఆర్!

  • 'అజ్ఞాతవాసి' ఫ్లాప్ తో నిరాశలో త్రివిక్రమ్
  • త్రివిక్రమ్ తదుపరి చిత్రం ఎన్టీఆర్ తోనే
  • 'జయాపజయాలు కామన్' అని అనునయించిన ఎన్టీఆర్
ప్రత్యక్ష రాజ‌కీయాల్లోకి వెళ్లాలని భావిస్తున్న పవన్ కల్యాణ్ కు 'అజ్ఞాతవాసి'తో ఓ భారీ విజయాన్ని ఇవ్వాలని చాలా గట్టిగా కృషి చేసి విఫలమైన త్రివిక్రమ్, ప్రస్తుతం నిరాశలో కూరుకుపోగా ఎన్టీఆర్ ఫోన్ చేసి ఓదార్చారట. టాలీవుడ్ వర్గాల నుంచి అందిన సమాచారం మేరకు, త్రివిక్రమ్ కు ఎన్టీఆర్ ఫోన్ చేసి ధైర్యం చెప్పారని తెలుస్తోంది. త్రివిక్రమ్ తదుపరి చిత్రం ఎన్టీఆర్ తోనేనన్న సంగతి తెలిసిందే.

 ఈ నేపథ్యంలో మరింత నిరాశలోకి త్రివిక్రమ్ వెళ్లకుండా, ఫోన్ చేసిన ఎన్టీఆర్, జయాపజయాలు చాలా కామన్ అని, ఫెయిల్యూర్ గురించి పట్టించుకోవద్దని అనునయించాడట. మన సినిమాపై దృష్టి పెట్టాలని, అది కచ్చితంగా హిట్ అవుతుందని, తిరిగి సక్సెస్ ట్రాక్ ఎక్కవచ్చని చెప్పాడట.
NTR
Trivikram Srinivas
Agnatavasi

More Telugu News