పోస్టు పెయిడ్ వినియోగదారులకు ఎయిర్ టెల్ మరో ఆఫర్!
- పోస్టు పెయిడ్ వినియోగదారులకు ఏడాది పాటు అమెజాన్ ప్రైమ్ మెంబర్షిప్ ఉచితం
- రూ.499, ఆపై ప్లాన్లకు మాత్రమే
- అపరిమితంగా వీడియో యాక్సెస్
ఆఫర్లో భాగంగా వినియోగదారులు అమెజాన్ ప్రైమ్ వీడియోలను అపరిమితంగా యాక్సెస్ చేసుకోవచ్చు. అలాగే 11 మిలియన్ ప్రైమ్ ఎలిజబుల్ ప్రొడక్ట్స్‌ను ఎంజాయ్ చేయవచ్చని ఎయిర్టెల్ తెలిపింది. అమెజాన్ డాట్ ఇన్‌లో ప్రత్యేక రాయితీలు, డీల్స్‌ను కూడా పొందవచ్చని వివరించింది.
ఎయిర్టెల్ పోస్టు పెయిడ్ ఖాతాదారులు ఈ అమెజాన్ ప్రైమ్ మెంబర్‌షిప్‌కోసం తొలుత గూగుల్ ప్లే స్టోర్ నుంచి ఎయిర్టెల్ టీవీని డౌన్ లోడ్ చేసుకోవాల్సి ఉంటుంది. అనంతరం దానిని ఓపెన్ చేసి ఎయిర్టెల్-అమెజాన్ డిజిటల్ ఆప్షన్‌పై క్లిక్ చేయడం ద్వారా ప్రైమ్ మెంబర్‌షిప్‌ను రిజిస్టర్ చేసుకోవాల్సి ఉంటుంది. తర్వాత నచ్చిన సినిమాలు, కామెడీ, కిడ్స్ షోలను వీక్షించవచ్చు. ఎయిర్టెల్ వి-ఫైబర్ బ్రాడ్ బ్యాండ్ వినియోగదారులు కూడా ఆ ఆఫర్‌ను పొందవచ్చని ఎయిర్టెల్ తెలిపింది.