'ఇక నన్ను చంపేయండి' అంటున్న క్రిస్ గేల్!
Get Instant Access to ap7am Free web app · Opens in one tap Install

'ఇక నన్ను చంపేయండి' అంటున్న క్రిస్ గేల్!

  • జిమ్ లో వీడియో పోస్ట్ చేసిన చాహల్
  • ఇది చాహలా? గేలా? అన్న షంషీ
  • గేల్ కన్నా ఎక్కువ బరువు ఎత్తగలనన్న చాహల్
  • ఇక చంపేయండంటూ గేల్ కామెంట్
వెస్టిండీస్ విధ్వంసకర బ్యాట్స్ మెన్ క్రిస్ గేల్ సోషల్ మీడియాలో పెట్టిన పోస్ట్ వైరల్ గా మారింది. 'ఇక నన్ను చంపేయండి' అంటూ ఆయన సరదాగా పెట్టిన కామెంట్ నెటిజన్లను ఆకర్షిస్తోంది. వివరాల్లోకి వెళ్తే, గత ఏడాది టీ20ల్లో అత్యధిక వికెట్లు తీసిన టీమిండియా స్పిన్నర్ చాహల్ ఫిబ్రవరిలో దక్షిణాఫ్రికాతో జరగనున్న వన్డే, టీ20లకు సిద్ధమవుతున్నాడు. ఈ క్రమంలో తాను జిమ్ లో కష్టపడుతున్న వీడియోను ఇన్స్టాగ్రామ్ లో పోస్ట్ చేశాడు.

ఈ వీడియోను చూసిన విండీస్ క్రికెటర్ షంషీ... ఈ బరువులు ఎత్తుతున్నది చాహలా? లేక క్రిస్ గేలా? అని కామెంట్ చేశాడు. దీనిపై స్పందించిన చాహల్... తాను క్రిస్ గేల్ కన్నా ఎక్కువ బరువులు ఎత్తగలనని, ఇది జస్ట్ వార్మప్ సెట్ మాత్రమే అంటూ రిప్లై ఇచ్చాడు. దీనిపై క్రిస్ గేల్ తనదైన శైలిలో స్పందించాడు. 'ఇక నన్ను చంపేయండి' అంటూ సరదాగా వ్యాఖ్యానించాడు. రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు తరపున క్రిస్ గేల్, చాహల్ లు ఆడిన సంగతి తెలిసిందే. వీరిద్దరి మధ్య మంచి స్నేహం ఉంది.  
chris gayle
chahal

More Telugu News