Get Instant Access to ap7am Free web app · Opens in one tap Install

ఎయిర్ ఏషియా కొత్త ఆఫ‌ర్‌.. రూ. 1599కే హైద‌రాబాద్- బెంగ‌ళూరు ప్రయాణం!

  • అడ్వాన్స్ బుకింగ్స్‌కి మాత్ర‌మే
  • మ‌రికొన్ని ప్ర‌త్యేక రూట్ల‌కి కూడా ఆఫ‌ర్‌ 
  • జనవరి 14 వరకు బుకింగ్స్ 
హైద‌రాబాద్ నుంచి బెంగ‌ళూరు వెళ్లే ప్రయాణికులకు ఎయిర్ ఏషియా శుభ‌వార్త‌ చెప్పింది. రూ. 1599కే విమానంలో ప్ర‌యాణించే అవ‌కాశాన్ని ప్రముఖ విమానయాన సంస్థ ఎయిర్‌ఏషియా క‌ల్పిస్తోంది. దీంతో పాటు కొన్ని ప్ర‌త్యేక రూట్ల‌కు కూడా రూ. 1600 కంటే త‌క్కువ‌కే విమాన టికెట్ అంద‌జేస్తోంది. అయితే ఈ ఆఫ‌ర్ ఆన్‌లైన్‌ అడ్వాన్స్‌ బుకింగ్స్‌కు మాత్రమే.

భువనేశ్వర్‌-కోల్‌కతా, కొచ్చి-బెంగళూరు, హైదరాబాద్-బెంగళూరు మధ్య టికెట్‌ ప్రారంభ ధర రూ.1599గా ఎయిర్ఏషియా వెల్లడించింది. అలాగే పూణె-బెంగళూరు, భువనేశ్వర్‌-బెంగళూరు, భువనేశ్వర్‌-రాంచీ, రాంచీ-కోల్‌కతా, కోల్‌కతా-బగ్డోగ్రా, గోవా-బెంగళూరు, గువహటి-ఇంఫాల్‌ల మధ్య ప్రయాణానికి టికెట్‌ ప్రారంభ ధర రూ.1899గా ఉంది. రాయితీ‌ ధరలు 2018 మే 6వ తేదీ వరకు ప్రయాణాలకు మాత్రమే వర్తించ‌నున్నాయి. ఈ ఆఫర్‌ ద్వారా జనవరి 14 వరకు బుకింగ్స్‌ చేసుకోవచ్చు. కార్డులతో చెల్లింపులకు నాన్‌ రిఫండబుల్‌ ప్రాసెసింగ్‌ ఛార్జీలు ఉంటాయని ఎయిర్‌ ఏషియా స్పష్టం చేసింది.
hyderabad
air asia
new offer

More Telugu News