మార్క్యూ పేరుతో స్మార్ట్‌టీవీ, ఏసీలను ఆవిష్కరించిన ఫ్లిప్‌కార్ట్!
- సీఈఎస్ 2018లో ఆవిష్కరణ
- మే నెలలో విడుదలకానున్న 32 ఇంచుల హెచ్డీఆర్ టీవీ
- భారత ప్రజల కోసం ప్రత్యేకంగా డిజైన్
ఈ మేరకు కన్జ్యూమర్ ఎలక్ట్రానిక్ షో 2018లో వీటిని ఆవిష్కరించింది. 32 ఇంచుల హెచ్డీఆర్ స్మార్ట్‌టీవీ మే నెలలో అందుబాటులోకి వస్తుందని ఫ్లిప్‌కార్ట్ ప్రైవేట్ లేబుల్ హెడ్ ఆదర్శ్ మీనన్ వెల్లడించారు. అలాగే `ఇన్నోకూల్` రేంజ్‌తో 4 రకాల వేరియంట్లలో ఏసీలను కూడా ఫ్లిప్‌కార్ట్ అందుబాటులోకి తీసుకురానుంది. ప్రత్యేకంగా భారత ప్రజల అవసరాల కోసమే ఈ ఉత్పత్తులను డిజైన్ చేసినట్లు ఆదర్శ్ మీనన్ పేర్కొన్నారు.