Get Instant Access to ap7am Free web app · Opens in one tap Install

ఎన్టీఆర్ పక్కనే ఒక్క ఫ్రేమ్ లో కనిపించినా చాలని బాపు గారిని అడిగాను: కోట శంకర్ రావు

  • ఒక రోజున బాపు గారి ఇంటికి వెళ్లాను 
  • ఎన్టీఆర్ మూవీలో ఛాన్స్ ఇవ్వమని అడిగాను 
  • ఆ అవకాశాన్ని .. అదృష్టాన్ని అయన కల్పించారు
తాజాగా తెలుగు పాప్యులర్ టీవీ ఇంటర్వ్యూలో కోట శంకర్ రావు మాట్లాడుతూ, ఎన్టీ రామారావు గారితో నటించిన 'శ్రీనాథ కవి సార్వభౌముడు' సినిమాను గురించి ప్రస్తావించారు." ఎన్టీ రామారావుగారి చివరి చిత్రంలో నేను నటించడం నిజంగా నేను చేసిన అదృష్టమని అనుకుంటున్నాను. అప్పటివరకూ నేను 'బాపు' గారి దర్శకత్వంలో కూడా నటించలేదు. చెన్నైలో వున్నప్పుడు బాపు గారి ఇంటికి తరచూ వెళుతూ ఉండేవాడిని''.

 "అలా ఒకసారి వాళ్లింటికి వెళ్లి ఎన్టీ రామారావుగారితో సినిమా చేస్తున్నారు గదా .. అలాగే మీ దర్శకత్వంలోను చేయలేదు .. ఈ సినిమాలో అవకాశం ఇవ్వండి' అని అడిగాను. వెండితెరపై ఒక ఫ్రేమ్ లో రామారావుగారితో కలిసి కనిపించే ఛాన్స్ ఇవ్వండి చాలు అన్నాను. ఆ మాటకు బాపు గారు నవ్వుకుని అలాగే అన్నారు .. అన్నట్టుగానే చిన్న పాత్ర ఒకటి ఇచ్చారు. ఆ పాత్ర కారణంగా 11 రోజుల పాటు రామారావుగారితో కలిసి గడిపే అవకాశం .. అదృష్టం దక్కాయి' అని చెప్పుకొచ్చారు.   
ramarao
kota shankar rao

More Telugu News