నాన్నకు పుట్టిన రోజు శుభాకాంక్షలు చెప్పిన బ‌న్నీ.. చిన్న నాటి ఫొటోను పోస్ట్ చేసిన అల్లు శిరీష్

  • నేడు అల్లు అరవింద్ పుట్టినరోజు
  • నాకు ఇష్టమైన వ్యక్తికి పుట్టినరోజు శుభాకాంక్షలు: బన్నీ
  • నా గుర్తింపు మాత్రం ఎప్పటికీ సన్‌ ఆఫ్‌ అల్లు అరవింద్‌: అల్లు శిరీష్
తమ తండ్రి అల్లు అరవింద్‌కు పుట్టిన రోజు శుభాకాంక్షలు చెబుతూ అల్లు అర్జున్, అల్లు శిరీష్ ట్వీట్లు చేశారు. తమ తండ్రితో దిగిన ఫొటోలను పోస్ట్ చేశారు. ప్రపంచంలోనే 'నాకు ఇష్టమైన వ్యక్తికి పుట్టినరోజు శుభాకాంక్షలు.. ల‌వ్ యూ' అని అల్లు అర్జున్ పేర్కొనగా, 'హ్యాపీ బర్త్‌డే డాన్‌ కోర్లియోన్‌! నేను ఎంత ఎదిగినా నా గుర్తింపు మాత్రం ఎప్పటికీ సన్‌ ఆఫ్‌ అల్లు అరవింద్‌ అనే ఉంటుంది.. నా హీరో' అని అల్లు శిరీష్ ట్వీట్ చేశాడు. ఈ సందర్భంగా అల్లు అర్జున్ తన తండ్రితో ఇటీవల దిగిన ఫొటోను పోస్ట్ చేయగా, అల్లు శిరీష్ మాత్రం తన చిన్నప్పుడు నాన్నతో దిగిన ఫొటోను అభిమానులతో పంచుకున్నాడు.  
Go Back to Shorts
Allu Arjun
allu shirish
allu aravind
birthday

More Telugu News