క్రిప్టోకరెన్సీ ఆవిష్కరించిన కొడాక్... ఒక్కసారిగా రెట్టింపైన షేర్ల విలువ
- కొడాక్ కాయిన్ పేరుతో వర్చువల్ కరెన్సీ
- ఫొటోగ్రాఫర్లకు ప్రత్యేకం
- బ్లాక్‌చెయిన్ మార్కెట్లోకి రంగప్రవేశం
వెన్ డిజిటల్‌తో కలిసి కొడాక్వన్ పాలసీలో భాగంగా ఈ డిజిటల్ కరెన్సీని విడుదల చేయనున్నారు. ఇది ఫొటోగ్రాఫర్లకు ప్రత్యేకం. ఫొటోలకు రాయల్టీని కూడా ఇదే కరెన్సీలో చెల్లించేందుకు కొడాక్ యోచిస్తోంది. ఓ వైపు బిట్‌కాయిన్ వంటి వర్చువల్ కరెన్సీ లావాదేవీలు అనూహ్య మార్పులకు లోనయి నష్టాలు తీసుకువచ్చే అవకాశముందని వార్తలు వస్తున్నప్పటికీ, ఇలా రోజుకో ఎక్స్చేంజ్ పుట్టుకు వస్తుండటం వినియోగదారులను ఆలోచనలో పడేస్తోంది.