మరోసారి సంచలన వ్యాఖ్యలు చేసిన జేసీ దివాకర్ రెడ్డి
- రైల్వే జోన్ విషయంలో ఎంపీలు చేసేదేమీ లేదు
- చేయాల్సింది మోదీనే
- అవసరానికి చంద్రబాబును మోదీ వాడుకుంటున్నారు
రైల్వే జోన్ పై చెప్పాల్సింది ప్రధాని మోదీనే అని ఆయన అన్నారు. మనిషికి కొంచెం భయం ఉంటేనే అన్నీ వస్తాయని... భయం లేకపోతే ఆ వ్యక్తిలో విచ్చలవిడితనం పెరిగిపోతుందని విమర్శించారు. అవసరాన్ని బట్టే ముఖ్యమంత్రి చంద్రబాబుకు మోదీ అపాయింట్ మెంట్ ఇస్తున్నారని... ఇది సరైన విధానం కాదని మండిపడ్డారు.