ఓటమికి చేరువైన టీమిండియా!

  • 29 ఓవర్ల నాటికి టీమిండియా స్కోరు 82/7
  • క్రీజులో అశ్విన్, భువనేశ్వర్ కుమార్
  • 208 పరుగుల స్వల్ప లక్ష్యాన్ని ఛేదించలేకపోతోన్న టీమిండియా
దక్షిణాఫ్రికాలోని కేప్‌టౌన్‌లో జరుగుతోన్న తొలిటెస్టు రెండో ఇన్నింగ్స్‌లో భారత బ్యాట్స్‌మెన్ పూర్తిగా విఫలమయ్యారు. 208 పరుగుల స్వల్ప లక్ష్యాన్ని ఛేదించే క్రమంలో రెండో ఇన్నింగ్స్‌లో బ్యాటింగ్‌కు దిగిన టీమిండియా ఆటగాళ్లు వరుసగా ఔటయ్యారు. ఎవ్వరూ చెప్పుకోదగ్గ స్కోరు చేయలేదు.

 మురళీ విజయ్ 13, శిఖర్ ధావన్ 16, పుజారా 4, విరాట్ కోహ్లీ 28, రోహిత్ శర్మ 10, వృద్ధిమాన్ సాహా 8, హార్దిక్ పాండ్యా 1 పరుగుల వ్యక్తిగత స్కోరు వద్దే వెనుదిరిగారు. ప్రస్తుతం క్రీజులో రవి చంద్రన్ అశ్విన్ 1, భువనేశ్వర్ కుమార్ 0 పరుగులతో ఉన్నారు. 29 ఓవర్లకి ఏడు వికెట్లు నష్టపోయిన టీమిండియా 82 పరుగుల స్కోరుతో బ్యాటింగ్ కొనసాగిస్తోంది.
Go Back to Shorts
India
south africa
Cricket

More Telugu News