ట్రంప్ లో మార్పు వచ్చిందా..? కిమ్ తో మాట్లాడడానికి సిద్ధమని ప్రకటన
- ఎటువంటి ముందస్తు షరతులు ఉండరాదు
- మాట్లాడేందుకు నాకు ఎటువంటి ఇబ్బంది లేదు
- కొరియా దేశాల మధ్య చర్చలతో సత్ఫలితాలపై ఆశాభావం
ఉత్తరకొరియా, దక్షిణ కొరియాల మధ్య చర్చలతో సానుకూల ఫలితాలు వస్తాయన్న ఆశాభావాన్ని ట్రంప్ వ్యక్తం చేశారు. వచ్చేవారం దక్షిణ కొరియాతో అధికారికంగా చర్చలు జరిపేందుకు ఉత్తరకొరియా అంగీకరించిన నేపథ్యంలో ట్రంప్ ఇలా స్పందించారు. అమెరికా అధ్యక్షుడిగా ట్రంప్ వచ్చిన దగ్గర్నుంచి అమెరికా, ఉత్తరకొరియా అధినేతల మధ్య మాటల యుద్ధం జరుగుతూనే ఉన్న విషయం తెలిసిందే.