Andhra Pradesh: అయామ్ ఫర్ ఆంధ్రా.. డోంట్ వర్రీ.. చంద్రబాబుతో మాట్లాడతా.. టీడీపీ ఎంపీలకు ప్రధాని భరోసా!

  • మోదీని కలిసి విభజన సమస్యలను ఏకరువు పెట్టిన టీడీపీ ఎంపీలు
  • రెండు మూడు రోజుల్లో చంద్రబాబుతో భేటీ అవుతానన్న ప్రధాని
  • సమస్యలను పరిష్కరిస్తానని భరోసా
‘అయామ్ ఫర్ ఆంధ్రా.. డోంట్ వర్రీ..’ విభజన సమస్యలపై తనను కలిసిన టీడీపీ ఎంపీలకు ప్రధాని మోదీ ఇచ్చిన అభయం  ఇది. రాష్ట్రంలోని సమస్యలు, విభజన హామీల్లో ఇప్పటి వరకు ఒక్కటి కూడా అమలు కాని వైనాన్ని ఎంపీలు ప్రధాని దృష్టికి తీసుకెళ్లారు. శుక్రవారం ఆయనను కలిసిన ఎంపీలు సమస్యలకు సంబంధించిన వినతి  పత్రాన్ని అందించారు.

ఎంపీల విన్నపానికి స్పందించిన మోదీ.. ఏపీకి తాను అన్ని విధాలుగా అండగా ఉంటానని భరోసా ఇచ్చారు. ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు అపాయింట్‌మెంట్ అడిగారని, రెండు మూడు రోజుల్లో ఆయనను కలిసి మాట్లాడతానని పేర్కొన్నారు. ఆందోళన వద్దని, ఆంధ్రప్రదేశ్‌కు తాను అండగా ఉంటానని హామీ ఇచ్చారు. కేంద్రం వద్ద పెండింగ్‌లో ఉన్న అన్ని సమస్యలను పరిష్కరిస్తానని స్పష్టం చేశారు. ‘‘అయామ్ ఫర్ ఆంధ్ర. డోంట్ వర్రీ’’ అని చిరునవ్వుతో సమాధానం ఇచ్చారు.  
Andhra Pradesh
Narendra Modi
Telugudesam
MP

More Telugu News