Disha Pathani: సినిమా కబుర్లు.. సంక్షిప్త సమాచారం!

షార్ట్స్‌లో చూడండి

*  జయం రవి, ఆర్య కథానాయకులుగా సుందర్ సి. దర్శకత్వంలో తెలుగు, తమిళ భాషల్లో రూపొందే 'సంఘమిత్ర' చిత్రంలోని కథానాయిక పాత్రధారిణి ఎంపిక కోసం పెద్ద కసరత్తు జరుగుతోంది. పలువురిని సంప్రదించినప్పటికీ ఇంకా ఎవరినీ ఫైనల్ చేయలేదు. ఈ క్రమంలో బాలీవుడ్ భామ దిశా పఠానితో ప్రస్తుతం చర్చలు జరుపుతున్నట్టు తెలుస్తోంది.    
*  తేజ దర్శకత్వంలో బాలకృష్ణ ప్రధాన పాత్రధారిగా ఎన్టీఆర్ బయోపిక్ రూపొందుతున్న సంగతి విదితమే. ఇందులో ఎన్టీఆర్ భార్య పాత్ర కోసం పలువురు ఆడిషన్స్ కి హాజరవుతున్నారట. వీరిలోంచి ఒకరిని ఎంపిక చేయడానికి దర్శకుడు తేజ ఫేస్ రికగ్నిషన్ టెక్నాలజీని వాడుతున్నాడట.
*  నాని హీరోగా కిషోర్ తిరుమల దర్శకత్వంలో ఓ చిత్రం రూపొందుతోంది. ఫిబ్రవరి నెలాఖర్లో ఈ చిత్రం షూటింగు మొదలవుతుంది. కాగా, ఈ చిత్రం కోసం 'చిత్రలహరి' అనే టైటిల్ని పరిశీలిస్తున్నట్టు తాజా సమాచారం.
*  రానా దగ్గుబాటి తాజాగా పదిహేను కేజీల బరువు తగ్గాడు. ప్రభు సాల్మన్ దర్శకత్వంలో రూపొందుతున్న 'హాథీ మేరా సాథీ' హిందీ చిత్రంలోని పాత్ర కోసం ఇలా బరువు తగ్గాడు. ఇందుకోసం చాలా స్ట్రిక్ట్ గా ఆహార నియమాలు పాటించాడట.     
Go Back to Shorts
Disha Pathani
Balakrishna
Nani
Rana

More Telugu News